కావలసిన పదార్ధాలు -
మైదా - రెండున్నర కిలోలు
వాము - 50 గ్రాములు
డాల్డా - 50 గ్రాములు
నూనె - రెండు కిలోలు
నీళ్ళు - 3 లీటర్లు
ఉప్పు - తగినంత
తయారుచేయు విధానం -ముందుగా నీటిని మరగబెట్టుకొవాలి.తరువాత మైదా,వాము,డాల్డా,తగినంత ఉప్పు వేసి పిండిలా కలుపుకొవాలి.ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొవాలి.ఈ ఉండల్ని గచ్చు మీద పాముతూ పాముతూ సన్నగా వచ్చలా చేసుకొవాలి.దీనిని గుండ్రంగా చుట్టుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి మూకెడ పెట్టి సరిపడా నూనె పొసి బాగా కాగాక ఈ రింగులను వేసి ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచి తీసేయాలి.
No comments:
Post a Comment